మహా సంకల్పం కు బదులు మహా చీటింగ్ అంటే మేలు

() చంద్రబాబు మహా
సంకల్పం మీద విమర్శల వెల్లువ

() ప్రజల కన్ను కప్పేందుకు
ప్రయత్నాలు

() అందుకే కొత్త
పేర్లతో చమత్కారాలు

() బాబు మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కేసులు

హైదరాబాద్) ఏ
కార్యక్రమం అయినా సంకల్పించి, పని మొదలు పెట్టాక ప్రగతిని సమీక్షించుకోవటం రివాజు.
ఆఖరికి పిల్లల్ని స్కూల్ లో చేర్పిస్తే ప్రతీ 2,3 నెలలకు ఒకసారి పరీక్షలు పెట్టి
ప్రోగ్రెస్ కార్డు ఇంటికి పంపిస్తారు. ప్రతీ ఏటా చివరల్లో మొత్తం మార్కులు వేసి
ప్రగతిని కళ్లకు కట్టినట్లు చెబుతారు. దాన్ని బట్టి ఏడాది కాలంలో చదువు ఎలా
సాగిందీ అర్థం అవుతుంది.

       ప్రజాస్వామ్య వ్యవస్థలోకూడా ప్రగతి
సమీక్షకు కొలమానాలు ఉంటాయి. అందుకే ప్రతీ ఏటా ఆగస్టు 15, జనవరి 26 లలో గవర్నర్,  ముఖ్యమంత్రి ల చేత ప్రసంగాలు చేయిస్తారు. ఆయా
సందర్భాల్లో సాధారణంగా ప్రభుత్వాలు సాధించిన ప్రగతి ని గణాంకాలతో సహా ప్రజలకు
తెలియ చేయటం రివాజు.

       ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాల
కాలాన్ని పరిపాలనలో పూర్తి చేసుకొన్నారు. ఇందుకు గాను ఆయన వారం రోజుల పాటు సంబరాలు
జరిపించాలని నిర్ణయించుకొని జరిపించేసుకొన్నారు. ప్రభుత్వ సొమ్ములతో ఆట పాటలు,
వేడుకలు నిర్వహించుకొన్నారు. నవ నిర్మాణ దీక్ష చేపట్టి మహా సంకల్ప సభ పెట్టేదాకా
వేడుకలు సా......గుతూనే ఉన్నాయి.

       అయినప్పటికీ చంద్రబాబు అబద్దాల హడావుడి
తప్ప రెండేళ్లలో చెప్పుకొనేందుకు ఏమీ కనిపించటం లేదు. అప్పులు తడిసి మోపెడు
అయ్యాయి. ఇప్పుడు తాజాగా మరో 15వందల కోట్ల అప్పుకోసం బయలు దేరారు. ప్రజలకు ఇచ్చిన
రుణమాఫీ వంటి హామీలు అలాగే వదిలేశారు. పట్టించుకొనే నాథుడు లేక పరిస్థితి చతికిల
పడుతోంది. సంక్షేమ పథకాలు కుంటి నడకన నడుస్తున్నాయి. రక రకాల సాకులతో వికలాంగులు,
వ్రద్దులు, వితంతువులు పింఛన్లకు కత్తెర వేశారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్
చూపించి రైతుల భూములు కొట్టేశారు.

       ఇన్ని రకాలుగా ప్రజలకు ద్రోహాలు
చేసినప్పుడు మహా సంకల్ప సభ ఎలా నిర్వహిస్తారు అన్న మాట వినిపిస్తోంది. అంటే ఇవే
మోసాలు, ఇవే ద్రోహాలు, ఇవే అబద్దాలు పునరావ్రతం అవుతాయని అనుకోవాలా అన్న మాట వినిపిస్తోంది.
అందుకే మోసాలు, అబద్దాలకు వ్యతిరేకంగా ప్రజల తరపున పోలీసు స్టేషన్లలో చీటింగ్
కేసులు పెట్టాలని ప్రతిపక్ష వైయస్సార్సీపీ నిర్ణయించింది. బుధవారం చేపట్టే ఈ
కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొననున్నారు.

 

Back to Top