బాబుతోనే కాదు..ఎల్లోమీడియాతోను యుద్ధం చేస్తున్నాం

పెద్దాపురం సభలో వైయస్‌ జగన్‌

పాదయాత్రలో మీ అందరి కష్టాలు, బాధలు విన్నాను..మీ అందరికీ నేనున్నాను

చంద్రబాబు పాలనంతా అవినీతి, అబద్ధాలు, మోసాలే

అగ్రిగోల్డు బాధితులకు ఒక్క రూపాయి కూడా ఇప్పించలేదు

గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా పాలన నడుస్తోంది

బాబు పాలనలో ఆర్టీసీ, కరెంటు, ఇంటి పన్నులు బాదుడే బాదుడు

భూములు లాక్కోవడానికి వీలుగా భూ సేకరణ చట్టానికి బాబు సవరణలు

బాబుకు పొరపాటున మళ్లీ ఓటేస్తే ప్రభుత్వ స్కూళ్లనేవే ఉండవు

చంద్రబాబు డ్రామాలు మరోసారి నమ్మితే రాక్షసిని నమ్మినట్టే

రాజకీయ వ్యవస్థలో నిజాయితీ, విశ్వసనీయత రావాలి

 

తూర్పు గోదావరి: ఇవాళ చంద్రబాబు ఒక్కరితోనే కాదు..ఎల్లోమీడియాతోను కూడా మనం యుద్ధం చేస్తున్నామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్లు చంద్రబాబు పాలనలో మోసాలు, అబద్దాలు, అన్యాయాలు చూశామని, ఎన్నికలు సమీపించేకొద్ది ఈ కుట్రలు, మోసాలు ఎక్కువవుతాయన్నారు. మరో 20 రోజులు ఓపిక పడితే అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రతి ఒక్కరికి చెప్పాలని పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

 • 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగానంటే ఆ దేవుడి దయ..మీ అందరి చల్లని దీవెనలే అని గర్వంగా చెబుతున్నాను. నా పాదయాత్ర ఇదే నియోజకవర్గం గుండా సాగింది. పాదయాత్రలో మీరు చెప్పిన బాధలు, కష్టాలు నాకు బాగా గుర్తున్నాయి. 
 •  ఇదే నియోజకవర్గంలో గిట్టుబాటు ధరలు అందక రైతులు అవస్థలు పడుతున్న పరిస్థితి చూశాను. రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. రైతులు చెప్పిన ఆవేదన నేను విన్నాను. ఒక వైపు రుణాలు మాఫీ కాక, మరోవైపు గిట్టుబాటు ధరలు రాక రైతులు పడిన ఆవేదన నేను చూశాను. చెరుకు రైతుకు వ్యత్యాసం చూపుతున్నారని రైతన్నలు నాతో అన్నది గుర్తుంది.
 •  ఇదే నియోజకవర్గంలోనే క్వింటాల్‌ బెల్లం నాన్నగారి పాలనలో రూ.5 వేలకు అమ్మిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కనీస ధర రావడం లేదని చెప్పిన బాధలు విన్నాను.
 •  ఆ రోజు పోలవరం ప్రాజెక్టును నాన్నగారు ఉరుకులు, పరుగులు పెట్టించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పూర్తిగా అవినీతిమయం చేశారు. అంచనాలు పెంచి చంద్రబాబు తన బినామీలకు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారు. ఏ స్థాయిలో వీరు పోలవరాన్ని దోచేస్తున్నారన్నది మరో ఉదాహరణ అవసరం లేదు.
 •  ఇదేనియోజకవర్గంలో చేనేతలు ఎక్కువే. నూలుపై సబ్సిడీ అందడం లేదు. ఇస్తామన్న సబ్సిడీ ఇవ్వలేదని చెప్పారు. ఇక్కడ అగ్రిగోల్డు బాధితులు ఎక్కువే. బాధితులకు ఒక్కరూపాయి కూడా చంద్రబాబు ఇవ్వలేదు. మీరు చెప్పినవన్నీ విన్నాను. మీ అందరికీ ఇవాళ భరోసా ఇస్తూ నేనున్నానని కచ్చితంగా చెబుతున్నాను.
 •  చంద్రబాబు ఐదేళ్ల పాలన మీరు చూస్తున్నారు. చంద్రబాబు పాలనలో మనకు కనిపించింది మోసం మోసం మోసం అన్న పదాలే కనిపిస్తాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. మరో పది రోజుల్లో ఎన్నికలకు వెళ్తున్నాం. చంద్రబాబు చేస్తున్న కుట్రలు, మోసాలు ఒక్కసారి చూడండి. అన్యాయమైన పాలన చూడండి.
 •   ఇటువంటి వ్యక్తి చంద్రబాబుకు మళ్లీ ఓటు వేస్తే..ఈ సారి ఏం జరుగుతుందో తెలుసా..ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదు. ఇప్పటికే అక్షరాల 6 వేల ప్రభుత్వ పాఠశాలలుమూత వేయించారు. మళ్లీ చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే అంతే సంగతి. ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీలు భర్తీ చేయరు. సకాలంలో పుస్తకాలు ఇవ్వడం లేదు. దగ్గరుండి నారాయణ స్కూళ్లను ప్రోత్సహిస్తున్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పేదవారు తమ పిల్లలను బడికి పంపించలేదుర. నారాయణ స్కూళ్లలో ఎల్‌కేజీ చదవాలంటే లక్ష ఫీజు గుంజుతున్నారు. 
 •  చంద్రబాబుకు మళ్లీ ఓటు వేస్తే..కరెంటు, ఆర్టీసీ చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ ధరలు, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు బాదుడే బాదుడు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక వీరబాదుడే.
 •  పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే అధికారంలోకి రాగానే పింఛన్లు, రేషన్‌కార్డులు కోత పెడతారు. 2014లో చంద్రబాబు సీఎం కాకముందు రాష్ట్రంలో 44 లక్షల పింఛన్‌కార్డులు ఉండేవి. వీటిని 36 లక్షలకు తగ్గించిన ఘనత చంద్రబాబుది. మళ్లీ పింఛన్లు పెంచింది ఎప్పుడో తెలుసా..ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రమే. ఈ వ్యక్తికి పొరపాటున ఓటు వేస్తే పింఛన్‌కార్డులు, రేషన్‌కార్డులు ఉండవు.
 •  చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే మీ భూములు, మీ ఇల్లు ఎప్పుడు పడితే అప్పుడు లాక్కుంటారు. ఇప్పటికే భూ సేకరణ చట్టంలో మార్పులు చేశారు. వెబ్‌ ల్యాండ్‌ పేరిట భూములు మాయం చేస్తున్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఈ సారి భూములు, ఇల్లు ఇవేవి ఉండవు. ఈ విషయం మర్చిపోవద్దు.
 •  ఇప్పటికే ఐదేళ్లలో ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, నదులు వదలడం లేదు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓట్లువేస్తే ఇవేవి ఉండవు. అన్నీ కూడా అడ్డగోలుగా దోచేస్తారు. ఒక లారీ ఇసుక కొనాలంటే రూ.40  వేలు అంటున్నారు. పొరపాటున చంద్రబాబు వస్తే రూ.1 లక్ష ఉంటుంది.
 •  గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా, పింఛన్లు, రేషన్‌కార్డులు, మరుగుదొడ్డి కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే. గ్రామాల్లో ఇప్పటికే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వారు అంటున్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మీరు ఏ సినిమాలో చూడాలో..ఏ టీవీ చూడాలో..ఏ పత్రికలు చదవాలో వారే చెబుతారు. మేం చెప్పినట్లు చేస్తేనే పింఛన్‌ ఇస్తామంటారు. 
 •  మీరు ఏస్కూల్‌లో చదవాలో. ఏ ఆసుపత్రికి వెళ్లాలో టీడీపీ నేతలే చెబుతారు. చంద్రబాబు గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 1994వ సంవత్సరాన్ని గుర్తుకు తెచ్చుకొండి. అప్పట్లో టీడీపీ అధికారంలోకి రావడానికి రూ.2 లకే కిలోబియ్యం, సంపూర్ణ మద్యపానం అన్నారు. అధికారంలోకివచ్చిన ఏడాదికే రెండు రూపాయల బియ్యాన్ని రూ.5.25లకు పెంచారు. చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే మళ్లీ అలాంటి మోసాలే చేస్తారు.
 •  ఇప్పటికే రైతులు, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందడం లేదు. రుణాలు మాఫీ కాలేదు. రేపు పొరపాటున చంద్రబాబుకు ఓటువేస్తే రైతులకు బ్యాంకుల నుంచి ఇచ్చే రుణాలు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పేరుతో కోత పెడతారు,
 •  చంద్రబాబుకు ఓటు వేస్తే తనను వ్యతిరేకించే వారు గ్రామాల్లో ఎవరు మిగలరు. రాజధాని నుంచి గ్రామాల వరకు తానే పోలీసులను పెట్టుకుంటున్నారు. ఎవరైనా చంపినా కేసులు ఉండవు. సీబీఐ, ఏసీబీని రాష్ట్రంలోని రానివ్వరు. వాళ్లే మనుషులను చంపేసి..మన బంధువులే చంపారని తప్పుడు వార్తలు రాయిస్తారు.
 •  నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మితే..: చంద్రబాబు పాలనలో ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు. కరెంటు చార్జీలు బాదుడే బాదుడు. ఇంటి పన్నులు బాదుడే బాదుడు. నీటి పన్నులు బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్‌ ధరలు బాదుడే బాదుడు. బాబు హయాంలో అన్ని రేట్లు  పెరిగిపోయాయి. పొరపాటున చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే ఇక వీర బాదుడు తప్పదు. బాబుకు మళ్లీ ఓటేస్తే ప్రజల జీవితాలను జన్మభూమి కమిటీల సభ్యులే శాసిస్తారు. బాబు మరోసారి అధికారంలోకి వస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేస్తాడు. ధరలు ఇంకా పెంచేస్తాడు. తనను వ్యతిరేకించే వారిని బతకనివ్వడు. మనుషులను చంపినా కేసులు ఉండవు. మీడియా ఇప్పటికే చంద్రబాబుకు అమ్ముడుపోయింది. నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మితే ఏమవుతుందో ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పే మాటలు విని నమ్మితే కూడా అదే అవుతుంది.    
 • ఎన్నికలు దగ్గరకొచ్చే సరికి చంద్రబాబు చేయని కుట్ర ఉండదు. ప్రతి గ్రామానికీ మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. ప్రతి ఓటర్‌ చేతిలో రూ.3 వేలు పెట్టి, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో ప్రతి ఒక్కరికీ చెప్పండి. 11 రోజులు ఓపిక పట్టండి, మన అందరి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ‘అమ్మ ఒడి’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాడని అక్కచెల్లెమ్మలకు చెప్పండి. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు అప్పు ఎంతైతే ఉంటుందో అంతే సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాడని, ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాడని తెలియజేయండి.
 • 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇస్తాడని చెప్పండి. చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశాడని రైతన్నలకు చెప్పండి. జగనన్న ముఖ్యమంత్రి అయితే పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో నేరుగా ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెడతాడని చెప్పండి. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. సున్నా వడ్డీలకే రుణాలు ఇప్పిస్తాడని చెప్పండి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు, గిట్టుబాటు ధరలకు గ్యారంటీ కూడా ఇస్తాడని చెప్పండి. 11 రోజులు ఓపిక పడితే మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు, పెన్షన్‌ను రూ.3 వేల దాకా పెంచుకుంటూ పోతాడని ప్రతి అవ్వాతాతకు చెప్పండి. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని నిరుద్యోగ యువతకు, చదువుకుంటున్న పిల్లలకు చెప్పండి. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అన్న భర్తీ చేస్తాడని తెలియజేయండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు అన్న ఇల్లు కట్టిస్తాడని చెప్పండి. మనం ప్రకటించిన నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రతి ఇంటికీ చేర్చండి.   
Back to Top