స్పీకర్‌: గట్టు రామచంద్రరావు - జూన్18, 2012

రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అయినా రెండు వారాలు అయినా రైతాంగా వ్యవసాయం చేయడానికి భయపడుతున్నా పరిస్ధితిలలో రైతులకోసం నేనున్నాను అని బరోస ఇచ్చే నాయకుడు లేడు. ఈ ప్రభుత్వానికి  రైతుల సమస్యల మీద కనీస అవగాహనలేదు.  చంద్రబాబునాయుడు హయాంలో రైతులు అప్పులబాదతో  ఆత్మహత్య చేసుకుంటే వారిని అవమానించే రీతిలో మాట్లాడారు. చంద్రబాబుని ఆదర్శంగా తీసుకుని కిరణ్‌కుమార్‌ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు, నూటికి అరవై శాతం మంది పల్లెల్లో వ్యవసాయం మీద ఆధారపడి వ్యవపాయం చేస్తున్నారు. రైతలకు కావలసిన విత్తనాలు, ఎరువులు, 9గంటల ఉచిత కరెంట్‌ అందించడంలో ఈప్రభుత్వం విఫలమైంది. మే నెలలో ప్రకటించవలసిన రైతు రుణ ప్రణాలికను ఇంతవరుకు ప్రకటించలేదు.మొన్నటిదాక ఒక ప్రాంతంలోనే సాగు బహిష్కరణచేసారు ఈ ప్రభుత్వ చర్యలవల్లా రాష్ట్రం మొత్తం సాగుబహ్కిరణ చేయవలసిన పరిస్ధితి వస్తుందెమో. ఈ ప్రభుత్వం రైతులకు బరోసా కల్పించాలి.వైయస్‌ రాజశేఖరరెడ్డి గారి మరణించిన ఈ రెండు సంవత్సరాలలో 12 సార్లు ఎరువుల ధరలు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం 876 మండలాలని కరువు మండాలాలుగా ప్రకటించారు కాని, కరువు చర్యలు ప్రకటించలేదు. ఎనబైమూడు లక్షలయాబైమూడు వేల రెండు వందల అరవై ఏడు ఎకరాల్లోపంట దెబ్బతిన్నదని ప్రకటించిన ఎకరాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడి 1816 కోట్లు  ప్రకటించిన ప్రభుత్వం 837 కోట్లు మాత్రమే ఇచ్చారు.
 రాష్ట్రంలో కౌలు రైతులు 50,60 లక్షల మంది కౌలు రైతులున్నారు. 20 లక్షలమందే ఉన్నారని ప్రభుత్వం చెప్పింది. రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు కౌలు రైతులకు గుర్తింపు తీసుకోచ్చారు,బ్యాంక్‌ల ద్యారా వడ్డీ వచ్చే సదుపాయం కల్పించారు.దేశానికే ఆహరబద్రత కల్పిస్తున్నా  రైతులకు, ఈ ప్రభుత్వాలు రైతులకు ఏం బద్రత కల్పిస్తుంది.
Back to Top