స్పీకర్: జూపూడి ప్రభాకరరావు -ఏప్రియల్5,2012

ఇటీవల రాష్ట్రప్రభుత్వం పెంచిన విధ్యుత్ చార్జీలను నిరసిస్తూ వై.యస్.ఆర్.కాంగ్రెస్  పార్టీ 3వ తేదీనా రాష్ట్రవ్యాప్తం గా అన్నిమండల కార్యాలయాల్లో ధర్నా నిర్వహించింది. రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నపుడు ఏ రోజూ కూడా రైతుల మీద కాని వినియోగదారుల మీద ఏ భారం లేకుండా చేశారు. చార్జీలు పెంచం అన్న రాజశేఖర్ రెడ్డిగారి మాటలని గాలికి వదిలేశారు.ఉచిత కరెంట్ ఇస్తామని  రాజశేఖర్ రెడ్డిగారు అంటే బట్టలు ఆరేసుకోడానికి తప్పా వాడుకోడానికి పనికిరాదు అన్నా చంద్రబాబునాయుడు గారు. మరి ఇప్పుడు తమ పార్టీ తరుపున ధర్నా లో పాల్గొన్నారు.విధ్యుత్ చార్జీలు పెంచింది ప్రభుత్వమైతే ప్రభుత్వాన్ని ఏ మాత్రం విమర్శించకుండా జగన్ మోహనరెడ్డి గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి బొత్స సత్యనారాయణ,దామోదర రాజనర్సింహా ఢిల్లీ కి వెళితే ఆ తర్వాత ప్లైట్ కి చంద్రబాబునాయుడు గారు ఢిల్లీ కి ఎందుకు వెళ్ళాడు.మిమ్మల్ని కూడా హైకమాండ్ పిలిచిందా? సోనియాగాంధిని, చిదంబరాన్ని గాని కలవడానికి వెళ్ళారా?ఈ రోజు జగజ్జీవనరావు గారికి భారతరత్న ఇవ్వాలని చంద్రబాబునాయుడు గారు  అంటున్నారు.కాని నేను నా హయాంలో కేంద్రం లో చక్రం తిప్పానని నేను చెప్పిన వారికే ప్రదానమంత్రి పదవి వచ్చిందని అంటున్నా వ్యక్తి ఆ రోజు జగజ్జీవనరావు గారికి ఎందుకు భారతరత్నఇప్పించలేకపోయారు? విధ్యుత్ ధర్నాలో ప్రభుత్వాన్ని చంద్రబాబునాయుడు ఎందుకు విమర్శించలేదు? ఢిల్లీ లో జగన్ మోహన్ రెడ్డి గారిఫై కుట్రపన్ని సమాలోచనలు జరిపారా. చంద్రబాబునాయుడు గారు కొంతమంది కాంగ్రెస్ పెద్దలను కలిసినట్టుగా మాకు కొంత సమాచారం ఉంది. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా.? హిట్లర్ కు ఉన్నా  అన్ని లక్షణాలు చంద్రబాబునాయుడికి ఉన్నాయి. 
మీరు ముఖ్యమంత్రి గా పనికిరారు అని ప్రజలు 2004,2009 లో  బుద్ధి చెప్తే మళ్ళి  రాజశేఖర్ రెడ్డిగారి మరణం తర్వాత ఏదో విదంగా ముఖ్యమంత్రి అవుదామని జగన్ మోహన్ రెడ్డి గారి ని టార్గెట్ గా పెట్టుకొని మీరు చేస్తున్న విష ప్రచారాన్ని  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మరియు మేధావులు ఖండిస్తున్నారు. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత మొగల్తూరులో ధర్నా చేస్తే లక్షలాదిమంది జనం వచ్చారు. మీరు ధర్నా చేస్తే ఎత్తి జైలులో వేసారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ  శ్రీనివాసురెడ్డి ఎవరో నాకు తెలితెలియాడు అంటున్నారు. పీ.సీ.సీ.అధ్యక్షునిగా ఉన్న ఒక వ్యక్తి కి  ఒక ఐ.జి. హోదా వ్యక్తి తెలియదంటే ప్రజలు ఏ విధంగా అర్ధం చేసుకుంటారో ఆలోచించాలి. కొన్నాళ్ళకి రాజశేఖర్రెడ్డి గారు ఎవరో నకు తెలియదు అంటారేమో . అలాగే నల్లా సూర్యప్రకాష్ గారు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు గారు కరెంట్ చార్జీలకు వ్యతిరేఖంగా పోరాటం చేయమంటే బషీర్బాగ్ కాల్పులు గుర్తుకొస్తున్నాయి.చంద్రబాబునాయుడు గారిని అణిచివేయడానికి రాజశేఖర్రెడ్డి గారు అసెంబ్లి లో ప్రకటన చేసినా 3 రోజుల తర్వాత మరణించారు అని అంటున్నారు.ఇంత కంటే దారుణం మరొకటి లేదు.ధలితుల మద్య ఇన్ని గొడవాలు జరగడానికి చంద్రబాబే కారణం.

తాజా వీడియోలు

Back to Top