స్పీకర్ : గట్టు రామచంద్రరావు -ఫిబ్రవరి 25,2012

రామోజీరావు తన పేపర్లో ఎప్పుడు హాంఫట్ అని హెడ్డింగ్స్ పెట్టి జనాలకు నీతులు చెబుతుంటాడు. 200కోట్లఖరీదు చేసే భూమిని హాంఫట్ చేసినట్లు అధికారులు తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీ లో 60ఎకరాల ప్రభుత్వ భూమిని రామోజీ ఆక్రమించాడు అని జాయింట్ కమీషనర్ తెలిపాడు.
 రామోజీ మీద మాటపాడని తెలుగుదేశం నాయకులు ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అని నేను అడుగుతున్న, రామోజీ ఫిల్మ్ సిటీ పుట్టుకే ఓ అవనీతి పుట్టుక, భూ ఆక్రమణలు ఎలా చేయాలో దేశానికి చాటి చెప్పాం.
 రామోజీరావు చేతిలో ఉన్న మీడియాను ఉపయోగించుకొని అడ్డగోలుగా భూఆక్రమనలు చేశాడు, అబ్బుల్లాపూరమేట్ నుండి అనాజ్ పేరు గాక తనదని చెప్పుకుంటాడు. రామోజీరావు, చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పేదల భూములు ఆక్రమించుకున్నాడు, సర్వే నెంబర్ 275లో 4ఎకరాలు 281లో 32 ఎకరాలు అసైన్డ్ భూమి ఉందని కనుగొన్నారు. ఇంత తెలిసిన ప్రభుత్వం ఎందుకు చర్యలూ తీసుకోవడంలేదు. అసెంబ్లీ లో ఒకరి మీద ఒకరు నీచ చరిత్రలు బయటపెట్టుకుంటున్నారు. ఆ ఇద్దరు కలిసి రామోజీరావు జైలుకు పంపుతారా పంపరా అని నేను అడుగుతున్న, చంద్రబాబు కిరణ్ ఇద్దరూ కుమ్మక్కై ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారు, వీరిద్దరి మద్య గొడవలో ప్రజాసమస్యలు గుర్తుకురావడంలేదు అన్నారు.
Back to Top