శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతానికి అందరం కలిసి పనిచేస్తాం 

మంత్రి పదవికి రాజీనామా అనంతరం కొడాలి నాని స్పందన .
 

అమరావతి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఇకపై శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతం అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. సీఎం నిర్ణయానికి ప్రతి ఒక్కరం కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏపీ కేబినెట్‌ బేటీ ముగిసిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. మొత్తం 24 మంది మంత్రులు  రాజీనామా సమర్పించినట్లు తెలిపారు.  ఏప్రిల్‌ 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒక అశయం, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారని కొడాలి నాని ప్రశంసించారు. సీఎం సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు సంతృప్తి ఉందన్నారు.  సామాజిక సమీకరణాల కారణంగా పాత మంత్రుల్లో అయిదారుగురు కేబినెట్‌లో కొనసాగే అవకాశం ఉందని అన్నారు. అనుభవం రీత్యా కొంతమందిని కొనసాగిస్తున్నట్లు సీఎం వైయ‌స్ జగన్‌ చెప్పారని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top