అవకాశవాద రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారు..

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి

శ్రీకాకుళంః అవకాశవాద రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.రాజకీయ అవసరాల కోసం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని స్వల్ప ఆధిక్యంతో అధికారంలోకి వచ్చి ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారన్నారు.టీడీపీ–జనసేనల మధ్య లోపాయికారి సంబంధాలు సాగుతున్నాయని మొదట నుంచి వైయస్‌ఆర్‌సీపీ ఆరోపణలు చేస్తూనే ఉందన్నారు.

ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలతో నిజమైందన్నారు.పవన్‌కల్యాన్‌ను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారన్నారు.వైయస్‌ జగన్‌ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ భరోసా కల్పిస్తున్నారన్నారు.చంద్రబాబు కుతంత్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.అవకాశవాద మాటలతో ప్రజలను వంచిస్తూ,నాలుగున్నరేళ్ల కాలంలో నాలుగున్నర లక్షల కోట్లు లూటీ చేసి అధికారంలో మళ్లీ రావడానికి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top