కొత్తవీరాపురం ప్రజలతో జననేత మమేకం

చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల కష్టాలన్నీ తీరుతాయని పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 66వ రోజు ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా కొత్తవీరాపురం చేరుకున్న వైయస్‌ జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జననేత కొత్తవీరాపురం ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక కష్టాలు ఉండవని భరోసా ఇచ్చారు. అనంతరం నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top