రంగడి ఘాటి నుంచి 332వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 

 శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 332వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం పాతపట్నం నియోజకవర్గం మెలియపుట్టి మండలంలోని రంగడి ఘాటి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి తూముకొండ, పెద్దమాడి స్కూల్‌, హేరాపురం, పెద్దమాడి గ్రామం మీదుగా చీపురుపల్లి వరకు పాదయాత్ర చేస్తారు. అక్కడ లంచ్‌ విరామం తీసుకుంటారు.

విరామం అనంతరం పలాస నియోజవర్గంలోని రేగులపాడు, టెక్కలిపట్నం, మోదుగులపుట్టి మీదుగా ఉండ్రుకుడియా క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.


Back to Top