విజయనగరం : వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆదివారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం పారాది నుంచి ప్రారంభమైంది. వైయస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు రానున్నాడనీ..అందరీ జీవితాలకూ వెలుగులు తీసుకొచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయన వస్తే గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లో జనం ఆరాట పడుతున్నారు. జననేత ఎప్పుడు తమ ప్రాంతానికి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. పారాది నుంచి పాదయాత్ర గొల్లపేట క్రాస్, రోంపల్లి క్రాస్ మీదుగా రామభద్రపురం వరకు కొనసాగనుంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు. <br/>