తూర్పుగోదావరి: రాజన్న రాజ్య స్థాపనకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 213వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. జగ్గంపేట రామాయంపేటలో వర్షం కురుస్తున్నా వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వర్షంలో సైతం వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.