అనంతపురం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 34వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. ఈ నెల 13న వైయస్ జగన్ అనంతపురం రూరల్ నియోజకవర్గంలోని పాపంపేట బైపాస్ నుంచి ఉదయం 8 గంటలకు పాదయాత్రను మొదలుపెడుతారు. 8.15 గంటలకు అనంతపురం రూరల్ మండలంలోని రుద్రంపేట గ్రామానికి చేరుకుంటారు. 8.30 గంటలకు సవేరా హాస్పిటల్ క్రాస్, 9 గంటలకు కక్కలపల్లి క్రాస్, 10 గంటలకు డాల్ఫీన్ హోటల్, 11 గంటలకు ప్రసన్న పల్లి చేరుకుంటారు. 12 గంటలకు భోజన విరామం. 2.45 గంటలకు రాప్తాడు మండలం నుంచి పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది.3 గంటలకు చిన్మయ నగర్, 4 గంటలకు రాప్తాడు, 5 గంటలకు గంగాలకుంటకు వైయస్ జగన్ పాదయాత్ర చేరుకుంటుంది. సాయంత్రం 6 గంటలకు 34వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.