జననేతను కలుసుకున్న రెల్లి కులస్తులు

విజయనగరంః వైయస్‌ జగన్‌ కలిసి రెల్లి కులస్తులు తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు.ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సహాకాలు అందడంలేదని దీంతో నిరుపేదలుగానే జీవనం సాగించాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్థిక,సంస్కృతిపరంగా వెనుకబడిన కులం రెల్లి కమ్యూనిటీ అని తెలిపారు.జగన్‌  సానుకూలంగా స్పందించారన్నారు. రెల్లి కులస్తుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని తెలిపారన్నారు. 2013లో రెల్లి కులాన్ని అతి నిరుపేద కులంగా గుర్తించి జీవో ఇచ్చారని , ఆ జీవో కాపీని కూడా జగన్‌మోహన్‌ రెడ్డికి ఇచ్చినట్లు తెలిపారు. దాని ప్రకారం విద్య,ఉద్యోగ,రాజకీయ నామినేటేట్‌ పదవులలో అవకాశం కల్పించాలని వినతించామన్నారు.తప్పకుండా పరిశీలిస్తామని వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారన్నారు.
Back to Top