శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వివిధ వర్గాల ప్రజలు,ఉద్యోగులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. 108 ఉద్యోగులు వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రం సమర్పించారు.108 సర్వీసుల నిర్వహణ అధ్వానంగా ఉందని సిబ్బంది ఫిర్యాదు చేశారు.వైయస్ జగన్‌ను పాదయాత్రలో కలిసి తమ సమస్యలను చెప్పుకుంటే వేధింపులకు గురిచేస్తున్నారని, కొంతమందిని తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్‌ను ఆశావర్కర్లు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.తమ బాధలు టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలిపారు. జీతాలు కూడా సరిగా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పనిభారం పెంచారు..తప్ప జీతాలు పెంచలేదని జననేతకు వివరించారు. వైయస్ జగన్‌ను తూర్పుకాపులు కలిశారు. బీసీ‘ఎ’లో చేర్చాలని జననేతను కోరారు. ప్రత్యేక కార్పొరేషన్,కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేయాలని వినతించారు.వైయస్ జగన్‌ను తాపీమేస్త్రీ జోగారావు కలిశారు. తిత్లీ తుపానులో గాయపడి కాలు కోల్పోయిన తనకు ప్రభుత్వం వైద్య ఖర్చులు కూడా ఇవ్వలేదని వాపోయారు. ఎమ్మెల్యే శివాజీ దగ్గరకు వెళ్తే కసురుకున్నారని జోగారావు తెలిపారు.