శ్రీకాకుళంః ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 336వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం పలాస నియోజకవర్గం, వజ్రకొత్తూరు మండలం నారాయణ పురం శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి హరిపురం, అంబుగాం మీదుగా రాణిగాం వద్ద ఇచ్ఛాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ శ్రేణులు వైయస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. మహిళలు ఎదురెళ్లి మరి అపూర్వ స్వాగతం పలికారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రజలు జననేత చెప్పుకోవడానికి తరలివస్తున్నారని ఇచ్చాపురం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త సాయిరాజ్ అన్నారు. నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధి సమస్య,తిత్లీ తుపాను కారణంగా రైతులు తీవ్రంగా పోయారన్నారు.ప్రభుత్వం ప్రోత్సహం లేక సదుపాయాలు లేక మత్స్యకారులు వలసపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తిత్లీ తుపాన్ నష్టపరిహారం ఏమూలన కూడా సరిపోదన్నారు. సంక్షేమ పథకాలు అందక పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వైయస్ అధికారంలో వచ్చిన తర్వాత తిత్లీ బాధితులు, కొబ్బరి రైతులకు నష్టపరిహారంతో బాటు ఉద్ధానం కిడ్నీ బాధితులకు 10వేలు పెన్షన్ వంటి వైయస్ జగన్ హామీల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.వైయస్ జగన్ ప్రజలకు అండగా ఉండి భరోసా కల్పించడం పట్ల ప్రజలందరూ ఊరట చెందుతున్నారన్నారు.వైయస్ జగన్ ఎప్పుడు సీఎంను చేసుకుందామా అని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 9 నియోజకవర్గాల్ల ప్రజా సంకల్పయాత్ర పూర్తయింది. చివరి నియోజకవర్గం ఇచ్చాపురంలో పాదయాత్ర ప్రవేశించడంతో జిల్లా వాసులు తమ సమస్యలను జననేతకు చెప్పుకునేందుకు సిద్ధమయ్యారు.