రైతులను ఆదుకునే చిత్తశుద్ధి బాబుకు లేదు

అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, మంత్రులు హంద్రీనీవా ప్రాజెక్టును దోపిడీ ప్రాజెక్టుగా మార్చారని ధ్వజమెత్తారు. ఉరవకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిస్టిబ్యూటరీ పనులు నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు అనంత జిల్లా రైతులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 
Back to Top