అప్పులపాలవుతున్నామయ్యా...

వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న మీడ్‌డే మీల్స్‌ కార్మికులు 
శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో మధ్యాహ్న భోజన కార్మికులు కలిసి తమ సమస్యలు వివరించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తుందని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్ళారు.జీతాలు సక్రమంగా చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం  చేశారు. కనీసం నిత్యావసర సరకులు కొనుగోలుకు డబ్బులు ఇవ్వడంలేదని వాపోయారు. మూడు నెలల,నాలుగునెలలకోసారి ఇస్తున్నారని తెలిపారు. దీంతో అప్పుల పాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.టీడీపీ ప్రభుత్వం హయాంలో కష్టాలు పడుతున్నామన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే మంచిరోజులు వస్తాయని భావిస్తున్నామన్నారు

Back to Top