పరిహారం పేరుతో పరిహాసం

శ్రీకాకుళం: బహాడపల్లి వద్ద వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజా సంఘాల నాయకులు కలిశారు. తిత్లీ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని, పరిహారం పేరుతో ప్రభుత్వం పరిహాసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా సాయం చేసిన వారితో పాటు ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.

మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నుంచి జంతిబంద వరకు పొడిగిస్తే ఉద్ధానం నీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. టీడీపీ నేతలు, వారి అనుచరులు తప్ప మరెవరికీ పరిహారం అందలేదని వైయస్‌ జగన్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే కేసులు ఎత్తివేయడంతో పాటు పరిహారం అందరికీ చెల్లిస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top