శ్రీకాకుళం:కిడ్ని బాధితులకు ఉత్తరాంధ్రకు కేరాఫ్‌గా మారుతోంది. తినడానికి తిండి లేని తమ బతుకులకు కిడ్ని వ్యాధి చికిత్స పెనుభారంగా మారిందని పాదయాత్రగా వచ్చిన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. కిడ్నీ వ్యాధి బాధితులను ఆదుకోవడమే కాకుండా, కిడ్నీ వ్యాధిని రూపుమాపే ప్రయత్నం చేస్తామని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధితులకు హామీ ఇచ్చారు. బాధితులతో జననేత మాట్లాడుతూ.. కిడ్ని బాధితుల కోసం ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ ఉద్దానం ప్రాంతాంలో పెడతాం. దాని వల్ల మంచి డాక్టర్లు అందుబాటులో ఉంటారు. డయాలసిస్ చేసుకునే కిడ్నీ బాధితులకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తాం. కలుషితమైన నీటిని తాగుతున్నారు కాబట్టే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి దీన్ని పరిష్కరించడానికి వంశధార నది, నాగావళి నది నీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రెండు నదుల నుంచి పైపులైన్లు వేసి ఆ పైపులైన్లను ఊర్లకు తీసుకొచ్చి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తాం. అప్పుడు బోరు నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉండదు. ఇవన్నీ చర్యలు తీసుకుంటాం. కిడ్నీ వ్యాధులు పూర్తిగా తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. కిడ్నీ వ్యాధికి సంబంధించి డయాలసిస్ స్టేజికి వెళ్లని వారికి మందులు ఫ్రీగా అందజేస్తాం. అంతేకాకుండా పౌష్టికాహారం కోసం నెలకు రూ. 4 వేలు అందజేస్తాం. ఆరోగ్యశ్రీలో కూడా మార్పు చేస్తున్నాం. కిడ్ని బాధితులకు డోనర్ సిద్ధంగా ఉంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ కిందికి తీసుకువచ్చి ఉచితంగా వైద్యం చేయిస్తాం. అంతేకాకుండా సారాయి మహమ్మారిని పారదోలుతాం. మద్యం నిషేదం తరువాతే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధితులకు భరోసా కల్పించారు.