శ్రీకాకుళంః వైయస్ జగన్‌ను కలిసిన లోహర బంధ పరిధిలోని 7 గ్రామాల కిడ్నీ బాధితులు.ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదన్నారు.కిడ్నీ బాధితులకు ఎలాంటి పెన్షన్‌లు ఇవ్వలేదని బాధితులు తెలిపారు.రోగులకు సరిపడా డయాలసిస్ సెంటర్‌లు కూడా లేవన్నారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బాధితులకు రూ.10వేల పెన్షన్ ఇస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.మహేంద్ర తనయ నుంచి నీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.వైయస్ జగన్ హామీల పట్ల కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేశారు.