<br/>శ్రీకాకుళం: విశాఖ జిల్లాకు చెందిన జోసఫ్ దంపతులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా జోసఫ్ బైక్‌పై నుంచి కిందపడి కాలు విరిగింది. దీంతో వైయస్ జగన్ తన సొంత డబ్బులతో జోసఫ్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయించారు. కోలుకున్న జోసఫ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి జననేతకు కృతజ్ఞతలు తెలిపారు. వారితో ఆప్యాయంగా మాట్లాడిన వైయస్ జగన్ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండని, మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.