

















చంద్రబాబు నరకాసురుడి పాలన అంతం చేస్తాం
వైయస్ జగన్ సునామీలో టీడీపీ కొట్టుకుపోతుంది
వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
శ్రీకాకుళం: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ధనం, మానం, ప్రాణాన్ని కూడా లెక్క చేయమని వైయస్‌ఆర్ సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు నరకాసుర పాలనను అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు సామాన్య కార్యకర్తగా ఇచ్ఛాపురం వచ్చాను. ఈ రోజు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా రాచమల్లు మీ ముందు నిలబడ్డాడు. నమ్ముకున్న వారికి న్యాయం చేసే కుటుంబం వైయస్‌ఆర్‌దని రాచమల్లు అన్నారు. అత్యంత సామాన్య కుటుంబాలకు చెందిన వారిని ప్రజా ప్రతినిధులను చేసిన ఘనత వైయస్‌ఆర్ కుటుంబానిదన్నారు.
వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలను 23 మందిని సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుగోలు చేశాడని మండిపడ్డారు. ప్రస్తుతం వారి టికెట్లు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారు. ఓటమికి దగ్గరగా ఉన్నాడు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. చంద్రబాబు దగ్గర అక్రమ సంపాదన దండిగా ఉంది. ఓటుకు డబ్బులు ఇచ్చి ఎక్కడ నందిని పందిని చేస్తాడోనని కార్యకర్తల అభిప్రాయం. అన్ని వేళల్లో అన్ని సందర్భాల్లో డబ్బుతో ప్రజలను కొనాలనుకోవడం అసాధ్యం. వైయస్ జగన్ సునామీలో చంద్రబాబు కొట్టుకుపోవడం ఖాయమని రాచమల్లు అన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నరకాసురుడి లాంటి పాలనను అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైయస్ జగన్‌ను గెలిపించేందుకు ప్రాణాన్ని కూడా లెక్క చేయమన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో నేలమట్టం చేస్తామన్నారు.