విజ‌య సంక‌ల్ప స్థూపం ఆవిష్క‌ర‌ణ‌

పాదయాత్ర ఆఖరి ఘట్టంలో పాల్గొన్న అశేష జ‌న‌వాహిని 

జననేత వెంట త‌ర‌లివ‌చ్చిన పార్టీ నాయ‌కులు

శ్రీకాకుళం: 14 నెలలుగా ఆంధ్రరాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. 341వ రోజు భోజన విరామం అనంతరం వేలాది మంది ప్రజలు కలిసి రాగా వైయస్‌ జగన్‌ విజయ సంకల్ప స్థూపం వద్దకు చేరుకున్నారు.

దారి పొడవునా వైయస్‌ జగన్‌ సీఎం అంటూ నినాదాలు, శాలువాలతో సత్కారాలు, చల్లగా ఉండాలని సర్వమత ప్రార్థనల అనంతరం వైయస్‌ జగన్‌ పైలాన్‌ వద్దకు చేరుకున్నారు. వేలాది మంది ప్రజల సమక్షంలో పాదయాత్ర స్మ్రతులతో నిర్మించిన పైలాన్‌ను వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ ఇచ్ఛాపురం పాత బస్టాండ్‌ సెంటర్‌లో నిర్వహించే బహిరంగ సభకు బయల్దేరారు. సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top