టీడీపీ నేతలను నిలదీయండి

శ్రీకాకుళం(నరసన్నపేట))ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని వైయస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ మండిపడ్డారు. నరసన్నపేటలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. రోడ్లను అభివృద్ధి చేయడం లేదని, మురుగు కాల్వలు అధ్నాన్నంగా ఉన్నాయని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇళ్ల కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదని, పూరిపాకల్లో కాలం వెళ్లదీస్తున్నామని పలువురు ఆవేదన వెలిబుచ్చారు.

 టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ప్రభుత్వ తీరు మారలేదని కృష్ణదాస్ మండిపడ్డారు. కోట్లాది రూపాయలు దుబారా చేస్తూ ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే... చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నాయకులను, ప్రభుత్వ ప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు. 
Back to Top