ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇవ్వాలి

పత్తికొండ(కర్నూలు))ఉత్తుత్తి హామీలిచ్చి దారుణంగా మోసం చేసిన చంద్రబాబు నాయుడికి మళ్లీ ఎవరూ ఓటు వేయరని  పలువురు ప్రజలు అభిప్రాయపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలోని హోసూరు గ్రామంలో గడపగడపకు వైయస్‌ఆర్‌ కారక్రమం నిర్వహించారు. రుణ మాపీ చేస్తానని చెప్పిన బాబు మాటలు నమ్మి మరింత అప్పులు చేసి మోసపోయామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ పంటలు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 


Back to Top