పింఛ‌న్లు ఇవ్వ‌రు.. రుణం మంజూరు చేయ‌రు

ముమ్మిడివ‌రం(కొత్త‌లంక‌): అర్హ‌త ఉన్నా ప్ర‌భుత్వం పింఛ‌న్లు ఇవ్వ‌డం లేద‌ని, క‌నీసం ఇంటి రుణాలు మంజూరు చేయ‌డం లేద‌ని కొత్త‌లంకకు చెందిన ప‌లువురు మ‌హిళ‌లు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ పితాని బాల‌కృష్ణ ఎదుట వాపోయారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న కొత్త‌లంక మండ‌ల ప‌రిధిలోని పెద‌గూడెం, ర‌మాబాయిపేట‌, అంకాళ‌మ్మ చెరువు గ‌ట్టు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓట్ల కోసం చంద్ర‌బాబు మాయ మాట‌లు చెప్పి త‌మ‌ను నిలువునా మోసం చేశాడ‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసే వ‌ర‌కు ప్ర‌జ‌లంతా ఉద్య‌మించాలన్నారు. చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌ను వివ‌రిస్తూ వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి చంద్ర‌బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. 
Back to Top