బసలదొడ్డి (పెద్దకడబూరు,కర్నూలు) : బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్లీనరీ వేదికగా నవరత్నాలు ప్రకటించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దేవరింటి లంకారెడ్డి, బూత్ కమిటీ కన్వీనర్‌లు శివరాములు, బోడెన్న అన్నారు. సోమవారం మండలంలోని బసలదొడ్డి గ్రామంలో బూత్ కమిటీ సభ్యులతో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి సభ్యులను వైయస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం బాబు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించి పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాడని విమర్శించారు. రాబోయేది రాజన్న రాజ్యం అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బూత్ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద నరసరెడ్డి, చిన్న నరసరెడ్డి, హనుమయ్య, హేమంతరెడ్డి, మన్మధ, వీరారెడ్డి, అంజనెయ్య, హనుమంతు, ములిగిరి తిమ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.------------------------<strong>ప్రజల సంక్షేమమే వైయస్ఆర్‌సీపీ లక్ష్యం</strong>బూరుగల (ప్యాపిలి, కర్నూలు): పేద ప్రజల సంక్షేమమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని జడ్పీటీసీ సభ్యుడు దిలీప్ చక్రవర్తి అన్నారు. మండల పరిధిలోని బూరుగల గ్రామంలో సోమవారం వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాలు పేరిట కులమతాలకు, పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైయస్ఆర్‌సీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు మద్దిలేటి రెడ్డి, తులసిరెడ్డి, శంకర్‌రెడ్డి, సాలన్న, రామతీర్థం నాయక్, లక్ష్మీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. <br/>