హామీలు అమలు చేయలేక మభ్యపెడుతున్నారు

వీరపనేనిగూడెం(గన్నవరం రూరల్‌): పెన్షన్లు లేవు, ఇళ్లు రావడం లేదంటూ వీరపనేనిగూడెం గ్రామస్తులు వాపోయారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని వీరపనేనిగూడెంలో గడపగడపకు వైయస్‌ఆర్‌ నిర్వహించారు. స్థానిక సుగాలిపేట, బీసీ కాలనీలో వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు ఇంటింటికీ వెళ్లి ప్రజా బ్యాలెట్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఇళ్లు నిర్మించుకునేందుకు గృహాలు మంజూరు కావడం లేదని, రేషన్‌ కార్డులు లేవని, పెన్షన్లు రావడం లేదని వాపోయారు. అనంతరం దుట్టా మాట్లాడుతూ.. మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయలేక రెండున్నరేళ్లుగా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. 

జగ్గంపేట:  వైయస్‌ఆర్‌ఆసీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌ గోపాలపురం గ్రామంలో గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తొలుత గ్రామం ముఖద్వారంగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ముత్యాల శ్రీనివాస్‌కు వివరించారు. దీనిపై ముత్యాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ...ఎన్నికల సమయంలో టీడీపీ మోసపూరిత హామీలను గుప్పించి నేడు వారు బాధపడుతుంటే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

తాజా ఫోటోలు

Back to Top