టీడీపీ పాలనపై అసంతృప్తి

న‌గ‌ర స‌మ‌స్య‌లు ప‌ట్ట‌వా?
క‌ర్నూలు:  పాల‌కులు, అధికారుల‌కు న‌గ‌రంలోని స‌మ‌స్య‌లే ప‌ట్ట‌డం లేద‌ని వైయ‌స్సార్‌సీపీ క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త హ‌ఫీజ్ ఖాన్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న 44వ వార్డు వెంక‌ట‌ర‌మ‌ణ కాల‌నీలో ప‌ర్య‌టించి, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టి కూడా స‌క్ర‌మంగా నెర‌వేర్చ‌లేద‌ని చెబుతూ ప్ర‌జాబ్యాలెట్ పత్రాలు కాల‌నీ వాసుల‌కు అంద‌జేశారు. ఈ కార్య‌క్రమంలో పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడు న‌ర‌సింహులు పాల్గొన్నారు. 

పార్టీలు మారే నేత‌ల‌ను నిల‌దీయండి
శ్రీ‌శైలం(మ‌హానంది): అధికారం కోసం పార్టీలు మారి ప‌బ్బం గ‌డుపుకుంటున్న నేత‌లు గ్రామానికి వ‌స్తే నిల‌దీయాల‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ బుడ్డా శేషారెడ్డి ప్రజలకు సూచించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని గాజుల‌ప‌ల్లెలో ప‌ర్య‌టించి, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... అర్హులైన వృద్ధులు, విక‌లాంగుల‌కు ఫించ‌న్లు ఇవ్వ‌క‌పోవ‌డం, గ‌తంలో వ‌స్తున్న వారివి వివిధ కార‌ణాల‌తో తీసేయ‌డం సిగ్గు చేట‌న్నారు. సీఎం చంద్రబాబు ప్ర‌చారం కోసం కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారే త‌ప్ప ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి కృషి చేయ‌డం లేద‌న్నారు. 

టీడీపీ పాల‌న‌పై ప్ర‌జ‌ల అసంతృప్తి
క‌ర్నూలు(అస్ప‌రి):  టీడీపీ పాల‌న‌పై జనంలో అసంతృప్తి మొద‌లైంద‌ని ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం అన్నారు. మండ‌ల ప‌రిధిలోని పుట‌క‌ల‌మ‌ర్రి, వ‌ల‌గొండ‌, ముత్తుకూరు, బిల్లేక‌ల్లు, అట్టెక‌ల్లు గ్రామాల్లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం జ‌య‌రాం అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. చంద్ర‌బాబు ప‌ల్లెల్లో క‌నీస సౌక‌ర్యాలు తీర్చ‌డంలో సైతం విఫ‌ల‌మయ్యార‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వాటిని ప‌రిష్క‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్యక్రమం చేప‌ట్టార‌ని ఆయ‌న వివ‌రించారు.

Back to Top