పింఛన్లు ఇవ్వకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
నెల్లూరు(మినీబైపాస్): పెండింగ్‌లో ఉన్న పింఛన్లను ఇవ్వకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన 33వ డివిజన్ ఇందిరానగర్‌లో పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. తమకు పింఛన్లు రావడం లేదని, ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ప్రయోజనం లేదని ప్రజలు ఎమ్మెల్యేకు తెలియజేశారు. పింఛన్ల పంపిణీపై సంబంధిత అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు పాలనకు మూడింది
పశ్చిమగోదావరి(పెనుమంత్ర): చంద్రబాబు పాలనకు త్వరలోనే కాలం చెల్లనుందని వైయస్సార్‌సీపీ నాయకుడు శ్రీనివాస్ అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమంలో భాగంగా ఆయన పెనుమంత్ర మండలం బట్లమాగూటురులో పర్యటించి స్థానికులకు ప్రజాబ్యాలెట్ అందజేశారు. చంద్రబాబు పాలనపై మార్కులు వేయించారు. ఈసందర్భంగా ప్రజలు చంద్రబాబు మోసపూరిత విధానాలపై నిప్పులు చెరిగారు.