మోస‌పూరిత హామీలతోనే బాబుకు ప‌త‌నం

విజ‌య‌న‌గ‌రం: ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన మోస‌పూరిత హామీలే ఆయ‌న‌ ప‌త‌నానికి కార‌ణం అవుతాయ‌ని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప‌శ్రీ‌వాణి అన్నారు. మోస‌పూరిత హామీల వ‌ల్ల సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో పూర్తి వ్య‌తిరేక‌త ఏర్ప‌డింద‌ని చెప్పారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం నియోజ‌క‌వ‌ర్గం గుమ్మ‌ల‌క్ష్మిపురం మండ‌లంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను తెలుసుకున్నారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో అర్హులైన వారికి ఆస‌రా పించ‌న్లు అంద‌కుండా చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. సంక్షేమ ప‌థ‌కాల నిధులు కూడా జ‌న్మ‌భూమి క‌మిటీల నాయ‌కులు జేబులు నింపుకుంటున్నార‌న్నారు. చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు త‌గిన విధంగా బుద్ధిచెప్పే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌ని హెచ్చ‌రించారు. కార్య‌క్ర‌మంలో ప‌లువురు పార్టీ నేత‌లు పాల్గొన్నారు.
శృంగవరపు కోటలో
విజ‌య‌న‌గ‌రం జిల్లా శృంగ‌వ‌ర‌పు కోట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని జామి మండ‌లం, గూడుకొమ్ము గ్రామంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌  పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త నెక్క‌ల నాయుడు బాబు ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ తిరుగుతూ చంద్ర‌బాబు అవినీతి ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top