విజయం.. వైఎస్సార్ సీపీదే!

దర్శి:  శాసన మండలి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు త థ్యమని
ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ధీమా వ్యక్తం
చేశారు. దర్శి నియోజకవర్గ ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో శుక్రవారం
నిర్వహించిన సమావే శం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో
జిల్లాలో 992 ఓట్లుకు గాను వైఎస్‌ఆర్ సీపీకి 492 మంది సభ్యులున్నారని..
స్వతంత్య్ర సభ్యుల మద్దతు తమకే ఉన్నందున విజయం వైఎస్సార్ సీపీని వరిస్తుందని
తెలిపారు. ప్రస్తుతం ధనవంతులే రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడి
పనిచేసిన కార్యకర్తగా అట్లా చిన్న వెంకట రెడ్డిని గుర్తించి.. ఎమ్మెల్సీ
అభ్యర్థిగా నియమించడం అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 
నిబద్ధతకు నిదర్శనమన్నారు.



టీడీపీ ఓటుకు నోటు కేసులో
అడ్డంగా దొరికిన విషయం అందరికీ తెలిసిందేనని తెలిపారు. అదే సంప్రదాయాన్ని జిల్లాలో
కొనసాగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ పార్టీ గుర్తుతో
గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు వైఎస్సార్ ఆశయాల
కోసం చిన్నవెంకట రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం
చేశారు. దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ,మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్
రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి
బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Back to Top