పిలిచి అవ‌మానిస్తారా?

  • రోజాను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు
  •  విశాఖ‌లో కూడా వైయ‌స్ జ‌గ‌న్‌ను ఇలాగే అడ్డుకున్నారు
  • మీలో లోపాలు లేకుండా ఎందుకు అడ్డుకుంటారు
  • సొంత ప్ర‌చారం త‌ప్పా..మ‌హిళా స‌ద‌స్సు వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు
  • రాజ‌ధాని పేరిట రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం
  • క‌మీష‌న్ల కోస‌మే ఇరిగేష‌న్ ప్రాజెక్టులు
  • జ‌న్మ‌భూమి పేరిట క‌మీష‌న్లు దండుకుంటున్నారు
  • పోలీసుల నుంచి ఉన్న‌త స్థాయి అధికారుల వ‌ర‌కు త‌మ సొంతానికి వాడుకుంటున్నారు
  • వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి
  • హైద‌రాబాద్‌:  విజ‌య‌వాడ‌లో నిర్వ‌హిస్తున్న మ‌హిళా పార్ల‌మెంట్ స‌ద‌స్సుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు, సీఎం చంద్ర‌బాబు ఆహ్వానించి ఇవాళ అందులో పాల్గొన‌కుండా అడ్డుకొని అవ‌మానించార‌ని ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి మండిప‌డ్డారు. రోజాను గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్న‌తీరును ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. మొద‌టి నుంచి కూడా ఎమ్మెల్యే రోజాపై చంద్ర‌బాబు స‌ర్కార్ క‌క్ష‌గ‌ట్టింద‌ని, గ‌తంలో చేయ‌ని నేరానికి ఏడాది పాటు అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేశార‌ని, ఇవాళ మ‌ళ్లీ స‌ద‌స్సులో పాల్గొన‌కుండా అడ్డుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. బుగ్గ‌న ఏమ‌న్నారంటే..ఆయ‌న మాట‌ల్లోనే..
    ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు స్వ‌త‌హాగా ఆహ్వానం పంపి మ‌హిళా స‌ద‌స్సుకు రావాల‌ని పిలిచి ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవ‌డం ఏంటీ. పోలీసులు బ‌ల‌వంతంగా ఆమెను కారులో ఎక్కించుకొని గుర్తు తెలియ‌ని ప్రాంతానికి త‌ర‌లించ‌డం ఏంటీ. పెళ్లికో, కార్య‌క్ర‌మానికి పిలిపించుకొని హాజ‌రుకాకుండా అడ్డుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు సమంజ‌సం. రాష్ట్ర నిధుల‌తో నిర్వ‌హించే స‌ద‌స్సుకు రోజాను హాజ‌రుకాకుండా అడ్డుకోవ‌డం ఎందుకు. మీరు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు. గ‌తంలో అసెంబ్లీలో రోజా ఏదో మాట్లాడింద‌ని ఏడాది పాటు స‌స్పెండ్ చేశారు. ఆమె హైకోర్టు  నుంచి అనుమ‌తులు పొంది అసెంబ్లీకి వ‌స్తే అప్పుడు అడ్డుకున్నారు. ఎందుకు రోజా విష‌యంలో భ‌య‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల వైయ‌స్ జ‌గ‌న్ విశాఖ‌లో నిర్వ‌హించే క్యాండిల్ ర్యాలీకి హాజ‌ర‌య్యేందుకు వెళ్లే ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. ఎందుకంత భ‌యం.   ఖ‌చ్చితం
     మీలో ఏదో లోపం ఉండ‌బ‌ట్టే ఇలా భ‌య‌ప‌డుతున్నారు. మీ బ్రోచ‌ర్‌లో మహిళ‌ల‌కు సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ ప్రోత్స‌హం ఇచ్చేందుకు మ‌హిళా స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. మ‌హిళ‌లు అన్ని రంగాల్లో పాల్గొనేందుకు ఇలాంటి స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. 
    నియంత పాల‌న ఉన్న దేశం మాదిరిగా ఏపీ క‌న‌బ‌డుతోంది. అంద‌రూ క‌ళ్లు తెరిచి చూడాలి. పోలీసు వ్య‌వ‌స్థ‌ను దారుణంగా వాడుకుంటుంది. ఈ స‌ద‌స్సులు కేవ‌లం వ్య‌క్తిగ‌త స్వార్థం కోసమే నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల ముసుగులో సెల్ఫ్ ప్ర‌మేష‌న్ చేసుకోవ‌డం స‌రికాదు.
    కేవ‌లం భ‌జ‌న ప‌లికే వారినే స‌ద‌స్సుకు రానిస్తున్నారు. నీతిమంతులు ఎక్క‌డ ఉన్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిలో రియ‌ల్ ఎస్టెట్ వ్యాపారం చేస్తున్నారు. క‌మీష‌న్ల కోసం  నీటి పారుద‌ల ప్రాజెక్టులు చేప‌డుతున్నారు. అవినీతి కోస‌మే ప‌ట్టిసీమ చేపట్టార‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ నిజాలు చెప్పారు. చివ‌ర‌కు దేవున్ని కూడా వ‌ద‌ల‌డం లేదు. శాంతిభ‌ద్ర‌త‌లు లోపించాయి. ఎక్క‌డ చూసినా అక్ర‌మ కేసులు పెడుతున్నారు. పోలీసు డిపార్టుమెంటును విచ్చ‌ల‌విడిగా వాడుకుంటున్నారు. గ్రామాల్లో చూస్తే స‌ర్పంచ్‌ను కూడా ప‌నిచేయించుకోవ‌డం లేదు. జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో ప్ర‌జాప్ర‌తినిధుల హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నారు. పింఛ‌న్లు మంజూరు కావాలంటే ఈ క‌మిటీల‌కు లంచాలు ఇవ్వాల్సి వ‌స్తోంది. ప్ర‌తి ఒక్క విష‌యంలో కూడా క్ష‌త్ర‌స్థాయికి అవినీతిని తీసుకెళ్తున్నారు. మాట్లాడితే సెల్ఫ్ ప్ర‌మోష‌న్ చేసుకుంటున్నారు. ఫోటోతో ప‌నిలేకుండా ప్ర‌జ‌ల
    హృద‌యాల్లో చోటు ద‌క్కించుకోండి. ఎమ్మెల్యేను అడ్డుకోవ‌డం ప్ర‌జాస్వామ్యానికే అవ‌మానం. ఇలాంటి చ‌ర్య‌లు మానుకోక‌పోతే మ‌హిళ‌లే ఈ ప్ర‌భుత్వానిక గుణ‌పాఠం చెబుతారు.
Back to Top