అమెరికాలోని తెలుగు వారి పరువు తీశారు


– అమెరికాలో వెలుగు చూసిన సెక్స్‌ రాకెట్‌ వెనుక పెద్దల హస్తం
– బాబు, లోకేష్‌లకు సతీష్‌ చాలా సన్నిహితుడు
– కాల్‌మనీ సీఎం అన్నందుకు రోజాను ఏడాది సస్పెండ్‌ చేశారు
– టీడీపీని అత్యంత ప్రమాదకరమైన పార్టీగా పరిగణించాలి
 
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన తానా ప్రస్తుత అధ్యక్షుడు సతీష్‌ను ఎఫ్‌బీఐ ప్రశ్నించడంతో అమెరికాలోని తెలుగువారి పరువు పోయిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. అమెరికాలో వెలుగు చూసిన సెక్స్‌ రాకెట్‌లో ఏపీ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆమె ఆరోపించారు. చంద్రబాబు వల్ల ఏపీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, టీడీపీని అత్యంత ప్రమాదకరమైన పార్టీగా పరిగణించాలని ఆమె డిమాండు చేశారు. గురువారం వాసిరెడ్డి పద్మ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ..  ప్రభుత్వ ప్రతినిధిగా కోమటి జయరాంను నియమించడం, పదవీ కాలాన్ని పొడగించారని తప్పుపట్టారు. 

నార్త్‌ అమెరికాలో ఇంత పెద్ద సెక్స్‌ రాకెట్‌ బయటకు వస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ఆమె నిలదీశారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నది సెక్స్‌ రాకెట్లు నడిపించేందుకా? అని ప్రశ్నించారు. తెలుగు సంఘాల పేరుతో ఈ రోజుల్లో అమెరికాలో ఇలాంటి సంఘటనలు జరగడంతో అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు పోయిందన్నారు. ఇలాంటి చర్యలు దురదృష్టకరమన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు అమెరికాలో తెలుగు సంఘాల పేరుతో అతిపెద్ద సెక్స్‌ రాకెట్‌ నడిపిస్తుంటే ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు క్షమించాలని ఆమె పేర్కొన్నారు. గతంలో విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ అంశం బయటకు వచ్చినప్పుడు అనేక మంది టీడీపీకి చెందిన ప్రముఖుల పాత్ర ఉందన్నారు. ఆ కేసును నీరుగార్చి..రెండేళ్ల వరకు కనీసం చార్జ్‌షీట్‌ కూడా వేయకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. ఇవాళ అమెరికాలో ఉన్న నిందితులను కూడా కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అమెరికాలో వెలుగు చూసిన సెక్స్‌ రాకెట్‌ వెనుక పెద్దల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తానా ప్రస్తుత అధ్యక్షుడు వేమన సతీష్‌ను ఎఫ్‌బీఐ ప్రశ్నించిందన్నారు. చంద్రబాబు, లోకేష్‌కు సతీష్‌ చాలా సన్నిహితుడన్నారు. ఇంత పెద్ద స్థాయిలో సెక్స్‌ రాకెట్‌ నడుస్తుంటే ఏమి తెలియదని చంద్రబాబు మౌనంగా ఉండటం ఎంతవరకు న్యాయమన్నారు. దీనికి చంద్రబాబు జవాబు చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండు చేశారు. 

– చంద్రబాబును కాల్‌మనీ..కామా సీఎం అన్నందుకు మా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేశారని వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు. ఇవాళ ప్రతి తెలుగు మహిళా చంద్రబాబును కాల్‌మనీ సీఎం అనే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. అమెరికాలో జరుగుతున్న వ్యవహారాలపై ఏపీ మొత్తం నివ్వెరపోతుందన్నారు. ఇప్పుడే అనేక సమస్యలతో ఉన్న రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందన్నారు. చంద్రబాబు కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా పోయిందన్నారు. నిన్న కాల్‌మనీ వేధింపులు తాళలేక విజయవాడలో పద్మ అనే మహిళా ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఇదీ చంద్రబాబు ఘనత అని ఎద్దేవా చేశారు. అమరావతి స్థాయిలో కాదు..అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువును చంద్రబాబు పొగొట్టారని విమర్శించారు. ఇప్పటి వరకు అమెరికాలో తెలుగు వారికి ఎవరెస్టు శిఖరమంతా పేరు, ఘనతలు ఉండేవని, చంద్రబాబు కారణంగా, ఆయన ప్రోత్సహిస్తున్న కొందరు వ్యక్తుల కారణంగా ఏపీ పరువు పోయిందన్నారు. ఈ నాలుగేళ్లలో ఏపీలో టీడీపీ నేతలు ఎలాంటి అరాచకాలు చేస్తున్నారో..చివరకు అమెరికాలో కూడా అలాంటి అరాచకాలే చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. టీడీపీని అత్యంత ప్రమాదకరమైన పార్టీగా పరిగణించాలని ఆమె డిమాండు చేశారు. ఏపీ ప్రజలను చంద్రబాబు అన్ని రకాలుగా ముంచుతున్నారని విమర్శించారు. అమెరికా సెక్స్‌ రాకెట్‌ విషయంలో ఎవరి పేర్లు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top