చంద్రబాబు రాజకీయ వ్యభిచారి


 
– చంద్రబాబు అవకాశవాది ఎక్కడైనా ఉన్నారా?
– బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు..ఇప్పుడు కాంగ్రెస్‌ కాళ్లు పట్టారు
– నందమూరి కుటుంబ సభ్యులకు కూడా సిద్ధాంతాలు లేవా? 
– ధర్మ పోరాట దీక్షల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు
 – రాష్ట్ర ప్రజల కోసం పోరాడే ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌
– తెలుగు ప్రజలు చంద్రబాబు నిజస్వరూపం తెలుసుకోవాలి
విజయవాడ:  చంద్రబాబుకు విలువలు, సిద్ధాంతాలు లేవని ఆ నాడు స్వర్గీయ ఎన్‌టీ రామారావు అన్నది అక్షర సత్యమైందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగిరమేష్‌ పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, తన ఉనికి కోసం నాలుగేళ్లు బీజేపీ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు..ఇవాళ కాంగ్రెస్‌ కాళ్ల వద్దకు వెళ్లారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేసిన ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ ఒక్కరే అన్నారు. బుధవారం విజయవాడలో పార్టీ నాయకులు రక్షణనిధి, మల్లాది విష్ణుతో కలిసి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడారు. నాడు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం స్వర్గీయ ఎన్‌టీ రామారావు స్థాపించిన టీడీపీని ఈ రోజు ఢిల్లీకి సలాం కొట్టి కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ కాళ్లు పట్టుకునేందుకు చంద్రబాబు వెంపర్లాడుతున్నారన్నారు. ఏపీ ప్రజలు ఒక్కసారి చంద్రబాబు నిజస్వరూపాన్ని తెలుసుకోవాలన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో బీజేపీ, నరేంద్ర మోడీ చంక నాకిన చంద్రబాబు..కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించని వ్యక్తి చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే బీజేపీని, నరేంద్ర మోడీని పొగిడిన చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానాలు చేసి..ఢిల్లీ వెళ్లి సన్మానించారన్నారు. నాడు నిసిగ్గుగా బీజేపీతో అంటకాగి, రాజకీయంగా వ్యభిచారం చేసిన చంద్రబాబు..ఈ రోజు బీజేపీని వదిలి మళ్లీ సోనియా, రాహుల్‌ గాంధీ కాళ్లు పట్టుకున్నారన్నారు. టీడీపీ ఏ ఉద్దేశంతో పుట్టిందో మరిచిపోయి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీని ఢిల్లీ లీడర్ల కాళ్ల వద్ద పెట్టారన్నారు. ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు ఏంటీ? చెత్త బాబులా తయారయ్యారని ప్రజలు, టీడీపీ నాయకులు కుతకుతలాడుతున్నారన్నారు. చంద్రబాబు లాంటి పచ్చి అవకాశవాది రాజకీయ చరిత్రలో ఎవరూ ఉండరన్నారు. ఈ రోజు ఒక వీరుడి లాగా, ధీరుడిలాగా, ధీశాలి మాదిరిగా రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి వైయస్‌ జగన్‌ అన్నారు. ప్రత్యేక హోదా కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్షలు చేశారన్నారు. ఎంపీ పదవులను త్రుణప్రాయంగా త్యాగం చేసింది వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే అన్నారు. ఎవరి మీద ధర్మ పోరాటం చేస్తావ్‌ చంద్రబాబు అని నిలదీశారు. కోట్లాది రూపాయలు తగలబెట్టి..ఆ జిల్లాలో, ఈ జిల్లాలో ధర్మ పోరాట దీక్షలు పెట్టి చిన్న పిల్లలను తీసుకొచ్చి పాఠాలు చెబుతావా అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ మాదిరిగా చంద్రబాబు పోరాటం చేయాలన్నారు. మా ఎంపీలు ఢిల్లీ నడిబొడ్డున పోరాటం చేశారని, దీక్షలు చేశారని గుర్తు చేశారు. కేంద్రంపై పోరాటం చేసేది, పోట్లాడేది..ప్రధాని నరేంద్రమోడీని ఎదురించింది వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే అన్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన నీవు..మాపై అబం«ఢాలు వేస్తావా అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీతో ఏపీలో కలువమని టీడీపీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు మీ నాయకుడు చంద్రబాబు కాంగ్రెస్‌ చంక నాకుతున్నారని ..మీరేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబుకు విలువలు, సిద్ధాంతాలు లేవని ఆ రోజు ఎన్‌టీఆర్‌ చెప్పింది అక్షర సత్యమైందని తెలిపారు. టీడీపీలో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు సిగ్గుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు  వ్యతిరేకంగా పుట్టిన పార్టీని అదే పార్టీలో కలిపేస్తే ..మీరు కూడా చంద్రబాబు దారిలో వెళ్లడం సిగ్గు చేటు అన్నారు. ఇటువంటి నీచమైన రాజకీయ నాయకులు అవసరమా అని ధ్వజమెత్తారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడానికి కాంగ్రెస్‌ కాళ్లు పట్టుకోవడం నలభై ఏళ్ల అనుభవం ఉందని చెబుతున్న చంద్రబాబుకు ఇది తగునా అన్నారు. చంద్రబాబు రాజకీయాలు వదిలేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top