బాబును భగవంతుడు కూడా కాపాడలేడు




– రాష్ట్రంలోకి సీబీఐ రాకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు
 – వైయస్‌ జగన్‌పై జరిగిన దాడిలో కర్త కర్మ క్రియ చంద్రబాబే
– అందుకే చంద్రబాబు గజ గజ వణికిపోతున్నారు
– ఆపరేషన్‌ గరుడపై విచారణ జరపమని ఎందుకు ఆడగరు?
– సీబీఐ మీద చంద్రబాబు స్టాండ్‌ ఏంటో చెప్పాలి
– చంద్రబాబు ఏనాడు విచారణలు ఎదుర్కోలేదు
– ఓటుకు కోట్లు కేసులో చిక్కి బాబు హైదరాబాద్‌ నుంచి విజయవాడ పరారు
– తనపై విచారణ జరగకుండా ఆపుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు
 
 
విజయవాడ: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని, ఆయన్ను భగవంతుడు కూడా కాపాడలేడని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో సీబీఐ రాకూడదని జీవో విడుదల చేయడం విడ్డూరంగా ఉందని, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. వైయస్‌ జగన్‌పై జరిగిన దాడి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, విచారణ నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని తప్పుబట్టారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  ఈ ఏడాది ఆగస్టు మాసంలో ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసిందని, సాధారణంగా ఏదైనా విచార ణ జరుపుకోవాలంటే సీబీఐ మా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని అందులో పేర్కొన్నారని చెప్పారు.  ఆ జీవోను విత్‌డ్రా చేసుకుంటూ 670 జీవోను విడుదల చేశారన్నారు. ఈ జీవోను రహస్యంగా దాచి పెట్టారన్నారన్నారు. దాన్ని నిన్న వారి రెండు పత్రికల్లో బ్యానర్‌ వార్తలు రాశారన్నారు. సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీలు లేదని అందులో పేర్కొన్నారు. బహుష ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి జీవో విడుదల చేసిన సంఘటన ఎప్పుడు లేదన్నారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. దేని కోసం తీసుకున్నారో అని చర్చించుకుంటున్నారు. ఈ జీవోను చంద్రబాబు ఎందుకు విడుదల చేశారని, దీనిలోని లోటుపాటు ఏంటని ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ జీవో 109ని ఆగస్టు 3వ తేదీన విడుదల చేశారన్నారు. 8.11. 2018లో విత్‌డ్రా చేశారన్నారు. ప్రభుత్వం ఎందకు విత్‌డ్రా చేసుకున్నది అన్నది ఆలోచించాలన్నారు. ఇందులో కొన్ని రాజకీయ పరిణామాలు జరిగాయన్నారు. అక్టోబర్‌ 25వ తేదీన విశాఖ ఎయిర్‌పోర్టులో వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందన్నారు. అది సంచలనం కావడంతో దానిపై చర్చనీయాంశమైందన్నారు. ఆ ఘటనపై వెంటనే డీజీపీ, ముఖ్యమంత్రి తేలికగా మాట్లాడటం చాలా అనుమానాలకు తావిస్తుందన్నారు. 31వ తేదీన ఈ ఘటనపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని 31వ తేదీన హైకోర్టులో కోరామన్నారు. రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర మంత్రిని కలిసి నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరామన్నారు. ఈ దశలో చంద్రబాబు ఎందుకు ఈజీవో విడుదల చేశారో ఆలోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సీబీఐ విచారణ చేస్తారన్న భయం చంద్రబాబుకు ఉందన్నారు. నిష్పక్షపాత విచారణ జరిగితే తాను బయటపడలేనన్న భయంతోనే అర్ధాంతరంగా అన్యాయమైన జీవో తెచ్చి బయటపడాలని చూస్తున్నారన్నారు. ఇంతదారుణంగా చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారన్నారు. బయట వ్యవస్థలు రాకుండా అడ్డుపడుతున్నారన్నారు. కేంద్రంపై పోరాటం చేస్తున్నారని ఎల్లో మీడియా చంద్రబాబును భుజాన వేసుకొని కథనాలు రాస్తున్నాయన్నారు. వైయస్‌ జగన్‌పై జరిగిన ఘటనకు చంద్రబాబే కర్త, కర్మ, క్రియ అన్నారు. నేరస్తుల అనుమతితో విచారణ చేస్తారా అని ప్రశ్నించారు. ఇంతదారుణమైన జీవోను విడుదల చేసి తప్పించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆపరేషన్‌ గరుడ కార్యక్రమంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆపరేషన్‌ గరుడపై ఎందుకు విచారణ కోరలేదని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కోరవచ్చు కదా? రాహుల్‌గాంధీని కలిసి వచ్చారన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా, ఎన్‌డీఏకు వ్యతిరేకంగా కూటమి తయారు చేస్తున్నారని చెప్పారన్నారు. సీబీఐ మీద చంద్రబాబు స్టాండ్‌ ఏందో స్పష్టం చేయాలన్నారు. కేంద్రంలో ఉన్న మిత్రులతో విభేదిస్తున్నారని, ఇక్కడేమో సీబీఐని రానివ్వని ఎందుకు అంటున్నారని నిలదీశారు. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో వాస్తవాలు బయటకు వస్తాయన్న భయంతోనే ఈ జీవోలు విడుదల చేశారన్నారు.

సిట్‌ అధికారులు ఎయిర్‌పోర్టులోని క్యాంటీన్‌ ఓనర్‌ను ఎందుకు విచారణ చేయించలేదని, ఆపరేషన్‌ గరుడ సృష్టికర్త శివాజీని ఎందుకు అమెరికా నుంచి రప్పించడం లేదన్నారు. ఎయిర్‌పోర్టులో ఎందుకు సీసీ కెమెరాలు పని చేయడం లేదని ప్రశ్నించారు.  చంద్రబాబు ఎంత ధైర్యవంతుడో అందరికి తెలుసు అన్నారు. ఓటుకు కోట్లు విషయంలో ఎంత ధైర్యంగా ఉన్నావో అందరికి తెలుసు అని ఎద్దేవా చేశారు. కట్టుబట్టలతో హైదరాబాద్‌ నుంచి అమరావతికి Ðð ళ్లారని విమర్శించారు. చంద్రబాబు గజగజలాడుతున్నారు కాబట్టే దుర్భిద్దితో ప్రయత్నం చేస్తున్నారన్నారు. హత్యాయత్నం కేసులో చంద్రబాబు భాగస్వామి అని ఆరోపించారు. రాష్ట్రంలో నాలుగేళ్ల పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. భూముల కేటాయింపుల్లో కమీషన్లు తీసుకున్నారని విమర్శించారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తంపట్నం పోర్టు నిర్మాణాల్లో అవినీతి జరిగిందన్నారు. కాల్‌మనీ, ఇసుక దోపిడీ, మైనింగ్‌ దోపిడీలపై విచారణ చేయించాలని కోరితే ఇంతవరకు ఎలాంటి విచారణ జరగలేదన్నారు. ఎన్నికల కోసం లక్షల కోట్లు దాచుకోని అనేక ప్రాంతాల్లో దాచి పెట్టారన్నారు. తప్పు చేయకపోతే ఎందుకు విచారణకు వెనుకాడుతున్నారని మండిపడ్డారు. నీతిమంతుడివా? లంచాలు తీసుకోని వ్యక్తివా అని నిలదీశారు. దుర్మార్గమైన ప్రవర్తనతో ముందుకు వెళ్తున్న చంద్రబాబుకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. న్యాయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, ధర్మం ఖచ్చితంగా జరుగుతుందని, చంద్రబాబు చేసిన దోపిడీలు, అరాచకాలు, హత్యాయత్నం ఘటన విషయాలు బయటకు రాక తప్పదన్నారు.  చంద్రబాబు ఏ విచారణకైనా సిద్ధమనే ధైర్యం ఉందా అని సవాలు విసిరారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హత్యాయత్నం ఘటనపై సీబీఐ విచారణకు ముందుకు రావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకనే వైయస్‌ జగన్‌ హత్యాయత్నం ఘటనపై థర్డ్‌ పార్టీ విచారణ కోరామన్నారు. దొంగలు కాబట్టే భయపడుతున్నారని, చుట్టూ కంచె వేసుకొని దాక్కోవాలని చంద్రబాబు చూస్తున్నారన్నారని, భగవంతుడు కూడా చంద్రబాబును కాపాడలేడని హెచ్చరించారు. ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. 
 

తాజా వీడియోలు

Back to Top