వైయస్ఆర్ 8వ వర్థంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 8వ వర్థంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వస్త్రాలు, పాలు, పండ్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయాన్నే వైయస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ వైయస్ఆర్ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జ్ఞాపకాలను తలచుకొని బాధాతప్త హృదయంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.  మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా రాజన్న రాజ్యాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిషలు కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

Back to Top