పార్లమెంట్ వద్ద వైయస్సార్సీపీ ఎంపీల ధర్నా

న్యూ ఢిల్లీః  ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో వైయస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తుంది. ప్రత్యేకహోదా సాధనే ధ్యేయంగా  ఆది నుంచి ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైయస్సార్సీపీ... ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. హోదా విషయంలో టీడీపీ, బీజేపీల దుర్మార్గపు వైఖరిని నిరసిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ బంద్ కొనసాగిస్తుంది. 

ఢిల్లీలోనూ వైయస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు నినాదంతో పార్లమెంట్ ఆవరణలో ఉద్యమిస్తున్నారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ధర్నా చేపట్టారు. ఈధర్నాలో వైయస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి,  మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, బుట్టా రేణుక పాల్గొన్నారు.

మరోవైపు,  ఏపీకి స్పెషల్ స్టేటస్ కోరుతూ లోక్ సభలో వైయస్సార్సీపీ వాయిదా తీర్మాన నోటీస్ ఇచ్చింది. దీనిపై చర్చకు గట్టిగా పట్టుబడుతోంది.  నిన్న లోక్ సభలో ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top