చంద్రబాబు రెయిన్‌గన్ పట్టుకుని సీమలో కరవును కంటికి కనిపించకుండా తరిమికొట్టాడంటూ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దండయాత్రతో దోమలపై సంహారం చేసి దోమ కనిపించకుండా చేశాడు. టెక్నాలజీతో సముద్రాలను కంట్రోల్ చేశాడు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టి పేపర్లకు ఎక్కాడు నాయుడు బాబు అంటూ ఛలోక్తులు విసిరారు. కులవృత్తుల్లో మెజారిటీలు బీసీలే..వారి కోసం వైయస్ ప్రారంభించిన ఉచిత విద్య పథకాన్ని అటకెక్కించి గతంలో పచ్చ చొక్కాల జేబులు నింపిన ఆదరణ పథకానికి బూజు దులిపి కులవృత్తుల వారికి పనిముట్లతో పంపిణీతో పేదరికంపై గెలిచేశామంటూ ప్రచారం మొదలుపెట్టాడని ప్రలోభాలకు ఆది గురువైన చంద్రబాబు అంటూ పేర్కొన్నారు.<br/>