నాలుగున్నరేళ్లలో చంద్రబాబు వందల కొద్దీ రహస్య జీవోలు జారీ చేశారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టానికి కూడా దొరక్కుండా వాటిని రహస్యంగా పెట్టారన్నారు. సీబీఐ ఎంట్రీ నిషేధంపై జారీ చేసిన రహస్య జీవోను మాత్రమే తమ అను‘కుల’ మీడియాకు లీకు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. మేనేజ్ చేసే దారులు కనిపించకే ఈ దారి పట్టారా అని అన్నారు.
‘రాజ్యాంగం ప్రకారం కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 67 అంశాలు, ఉమ్మడిజాబితాలో 46 అంశాలు ఉన్నాయి. సీబీఐ కేంద్ర జాబితాలో ఉంది. రాష్ట్ర పరిధిలో సీబీఐ ప్రవేశించరాదన్నారంటే ఆడిట్ చేయడానికి కాగ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కష్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కూడా ఇక్కడ పనిచేయరాదంటారేమో?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖ (ఐటీ) సోదాలు చేస్తుంటుందని, అందులో భాగంగా టీడీపీకి చెందిన ముగ్గురి ఆస్తులపై ఐటీ తనిఖీలు చేస్తే బాబు అండ్‌కో నానా యాగీ చేసిందన్నారు. రాజకీయ నాయకులు అక్రమార్జనపై తనిఖీలు చేయకూడదనేది బాబు విధానమా? అక్రమాలు చేసిన నాయ కులకు రక్షణ ఉండాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారా? అని నిలదీశారు.