వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తకు ఎమ్మెల్యేల పరామర్శ

తిరుపతి: పులివర్తి నాని అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి మండలం మొరవపల్లి చెందిన పుట్టా రవిని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణస్వామి, డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. రవి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, యశ్వంత్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top