చంద్రబాబు అసమర్ధ సీఎం
చిత్తూరు:   ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అస‌మ‌ర్ధుడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమ‌ర్శించారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో రోజా రావాలి జ‌గ‌న్..కావాలి జ‌గ‌న్ కార్య‌క్ర‌మం ద్వారా ఇంటింటా ప‌ర్య‌టించి న‌వ‌ర‌త్నాల‌పై ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..చంద్ర‌బాబు చేసిన మోసాల‌కు ఎమ్మెల్యేలు బ‌లి అవుతున్నార‌ని, ఇన్నాళ్లు మ‌హిళ‌ల‌కే ర‌క్ష‌ణ లేద‌ని భ‌య‌ప‌డ్డామ‌ని, ఇప్పుడు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కూడా ర‌క్ష‌ణ లేద‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌ని చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్ర‌బాబు..ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని కొత్త డ్రామాకు తెర‌లేపార‌ని విమ‌ర్శించారు. ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వ‌కుండా, ఈ రోజు వెయ్యి రూపాయ‌లు ఇస్తామ‌ని, అది కూడా ల‌క్ష‌న్న‌ర మందికే ఇస్తామ‌న‌డం మోసం చేయ‌డ‌మ కాదా అని ప్ర‌శ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top