అవినీతికి చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌..

ధర్మ పోరాటమంటూ అధర్మం మాట్లాడతావా..
చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజం
హైదరాబాద్ః చంద్రబాబు చేస్తోంది ధర్మపోరాటం కాదని అధర్మ పోరాటం అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు తన అన్యాయాలు, అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి ధర్మపోరాటాలు అంటూ ప్రజలను తప్పదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేపట్టిన అధర్మపోరాటానికి ఆరు జిల్లాల నుంచి నష్టాల్లో ఉన్న ఆర్టీసీ బస్సులపై  సభకు తరలించి ఆర్టీసీపై మరింత భారం మోపారన్నారు. సభల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. యువకులు,రైతులను మోసగించే మాటలు చెప్పి, బిర్యానీలు పెట్టి బస్సుల్లో బలవంతంగా సభకు రప్పించుకున్నారన్నారు. సుమారు రూ.40 కోట్ల రూపాయల ప్రభుత్వం సొమ్మును ఖర్చుచేసి నిర్వహించిన సభలో ప్రజల కష్టాలపై మాట్లాడపోగా రాజకీయాలు మాట్లాడారన్నారు. హత్యయత్నం జరిగి  వారం రోజులు కూడా కాలేదని, సభలో  వైయస్‌ జగన్‌పై ఇష్టానుసారం విమర్శలు చేసిన చంద్రబాబు అందుకే సభను పెట్టుకున్నట్లుగా ఉందన్నారు.  తన భజన చేసే నాయకులతో కూడా తిట్టించి చంద్రబాబు పైశాచిక ఆనందం పొందారన్నారు. ప్రజలంతా గమనించారన్నారు. చంద్రబాబు తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో  ధర్మం,న్యాయం,చట్టం,నీతి తన కాళ్లతో తొక్కిపెట్టేశారన్నారు.  చంద్రబాబుకు  తెలిసిందల్లా అధర్మం, అన్యాయం, చట్టవిరుద్ధమన్నారు. అవినీతికి ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారన్నారు.  కడప జిల్లాకు వచ్చి జగన్‌ను టార్గెట్‌ చేశారన్నారు. కడప జిల్లా కరువుతో విలవిలాడుతుందని, ఖరీఫ్‌లో పంట కూడాలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు పంటన్నీ ఎండిపోయి ప్రజలు కష్టాలు పడుతుంటే ఒక మాట కూడా రాలేదు. సంస్కారహీనంగా మాట్లాడటం ధర్మపోరాటమా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు రైతు కష్టాలు పట్టవన్నారు. నాలుగు సంవత్సరాలకు పైగా బీజేపీతో అంటకాగిన చంద్రబాబుకు అప్పుడు బీజేపీ మోసం కనబడలేదా అని ప్రశ్నించారు. అర్థరాత్రి మీటింగ్‌లు పెట్టి  ప్రత్యేహోదా ప్యాకేజీపై హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపిన చంద్రబాబు  నేడు కేంద్రప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమతో  పాటు పక్కన ఉన్న ప్రకాశం,నెల్లూరు జిల్లాలో అత్యంత దారుణంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నా... రైతులకు భరోసా కలిగించే  చిన్నమాట కూడా మాట్లాడకుండా రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. కనీసం కరువుపై  కేబినెట్‌ మీటింగ్‌లో కూడా చర్చించలేదన్నారు.  కేబినెట్‌లో కేవలం  భూముల దోచుకోవడానికి చర్చలు జరుపుతారని విమర్శించారు.  జన్మభూమి కమిటీల మాఫియాతో రాష్ట్రాన్ని దోచుకుంటారన్నారు. నీతులు మాట్లాడే చంద్రబాబు చ్రరితను పరిశీలించుకోవాలన్నారు. ప్రత్యేకహోదా తాకట్టు పెట్టి ధర్మపోరాటాలు చేయడం అనైతికమన్నారు.

 

Back to Top