ఎంపీల దీక్ష భగ్నం చంద్రబాబు కుట్రేఢిల్లీ: రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ప్రాణాలు లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే చంద్రబాబు తనకున్న పలుకుబడితో ఢిల్లీలోని దీక్షలను భగ్నం చేయించారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. కేజ్రీవాల్‌తో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయని, వైయస్‌ఆర్‌సీపీ పోరాటం ఉద్ధృతమైతే ఎక్కడ టీడీపీకి చెడ్డ పేరు వస్తుందో అని దీక్షను భగ్నం చేయించారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని, వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కొద్దిసేపటి క్రితం ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను ఢిల్లీ పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించిన విషయం విధితమే. దీంతో ఆసుపత్రి వద్ద వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
 

తాజా వీడియోలు

Back to Top