విజయవాడ: టీడీపీ నేతలకు కౌంట్‌డౌన్ మొదలైందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. విజయవాడలోని అలంకార్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బీసీల నిరసన కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ పాల్గొని చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. వచ్చే ఏడాది వైయస్ జగన్ పుట్టిన రోజును సీఎం హోదాలో చేసుకుందామని పిలుపునిచ్చారు. విజయవాడలో వైయస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని దీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. చంద్రబాబులాగా పొత్తుల కోసం వెంపర్లాడమని చెప్పారు.