విద్యను వ్యాపారం చేసిన నారాయణ, శ్రీచైతన్య

చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌
నెల్లూరు: నారాయణ, శ్రీచైతన్య కళాశాలలు విద్యాను వ్యాపారమయం చేశాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌ను కలిశారు. ఇంటర్‌ కోర్సును నారాయణ, చైతన్య విద్యాసంస్థలు వ్యాపారమయం చేశాయని, చదువుల పేరుతో పేద, మధ్యతరగతి విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకంటే భారీగా వసూలు చేయడం దారుణమన్నారు. జీఓను అమలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ను ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ కోరారు. 
Back to Top