మిర్చి యార్డును సందర్శించిన వైయస్సార్సీపీ నేతలు

గుంటూరు: మిర్చి మార్కెట్‌ యార్డును వైయస్సార్సీపీ నేతలు శుక్రవారం సందర్శించారు. మిర్చి ధరలపై రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం క్వింటాకు రూ.5 వేలే ధర పలుకుతుండటంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు.
 
వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మిర్చి మార్కెట్‌ను సందర్శించిన వారిలో మర్రి రాజశేఖర్‌, ఎమ్మెల్యే ముస్తాఫా, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు.

Back to Top