ఇదేనా బాబు మహిళా సాధికారత..?

  • మైనర్ బాలికపై కిరాతకంగా అత్యాచారనికి ఒడిగట్టిన టీడీపీ నేతలు
  • నిందితులకు కొమ్ముకాస్తున్న టీడీపీ ఎమ్మెల్యే, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌
  • బాలికకు న్యాయం జరిగేవరకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతుంది
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి
  • ఆస్పత్రిలో మహేశ్వరిని పరామర్శించిన నేతలు
గుంటూరు:  మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను టీడీపీ నేతలు వెనకేసుకొస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా ధ్వజమెత్తారు. ఈ నెల 15వ తేదిన గుంటూరు జిల్లా కోసూరు మండలం ఉయ్యందన గ్రామంలో నలుగురు వ్యక్తులు మైనర్‌ బాలికపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్వరి అనే బాలికను ఎమ్మెల్యే ముస్తఫా, వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌నేత లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్‌లు పరామర్శించారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బాలిక కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మైనర్‌ బాలిక మహేశ్వరిని నిర్భందించి కిరాతకంగా నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలు, ఫోటోలు తీసి బెదిరింపులకు గురి చేస్తూ చివరకు ప్రాణం తీయడానికి కూడా వెనకాడలేదని బాలిక తమతో చెప్పిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయిస్తే ఎస్సై మానవత్వం లేకుండా రేపు ఉదయం 10 గంటలకు రండి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు చేస్తున్న ఆగడాలను ఒక్కసారి ప్రజలంతా ఆలోచించుకోవాలన్నారు. అధికారం చేతులో పెట్టుకొని బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు వ్యక్తలకు టీడీపీ ఎమ్మెల్యే, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌లు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. నిందితులను గుర్తించి శిక్షించడమే కాకుండా వారి కాళ్లు, చేతులు తీసేస్తేనే ఇలాంటి వ్యక్తులకు బుద్ధివస్తుందన్నారు. ఇంకోసారి ఆడపిల్లపై అత్యాచారం చేయడానికి భయపడతారని అన్నారు.

పబ్లిసిటీ తప్ప మహిళా సంక్షేమం పట్టదా?
అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న కోసూరు మండలంలో మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగితే ఆ పసిపిల్ల అరుపులు ముఖ్యమంత్రికి చంద్రబాబుకు వినడలేదా అని ఎమ్మెల్యే ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డిలు ప్రశ్నించారు. ఈ నెల 10వ తేది మహిళా సాధికారత సమావేశం అని పెద్ద సభ పెట్టారు. ఇదేనా సాధికారత ఉద్దేశ్యం అని నిలదీశారు. సంపన్నుల కుటుంబాల కోడళ్లకు, కూతుళ్లకు మైకులు ఇచ్చి మాట్లాడించడమేనా సాధికారత అంటే అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చితప్ప మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టే ఆలోచన లేదన్నారు. మైనర్‌ బాలికపై అతి కిరాతకంగా అత్యాచారం జరిగినా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకోవాలన్నారు. బాలికపై అఘాయిత్యం జరిపిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బాధితురాలి పక్షాన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉందని  హెచ్చిరించారు. నిందితులకు శిక్ష విధించడంతో పాటు బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top