రాష్ట్రాన్నీ దోపిడీ వ్యవస్థగా మార్చేశారు

 
మాటలు మార్చడంలో చంద్రబాబును మించినవారు లేరు
వైయస్‌ఆర్‌ సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం: చంద్రబాబు రాష్ట్రాన్ని దోపిడీ వ్యవస్థగా మార్చేశారని, 175 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఆగడాలు పెట్రేగిపోతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన ప్రజా పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై పాదయాత్ర చేస్తుంటే మంత్రులు వెలిగొండ ప్రాజెక్టు వద్దకు క్యూకడుతున్నారన్నారు. జనవరిలో దర్శి నియోజకవర్గంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమానికి వచ్చి సెస్టెంబర్‌ నాటికి వెలిగొండ నీరు ఇస్తామని చెప్పిన పెద్ద మనిషి.. ప్రజలను మభ్యపెట్టేందుకు చేపట్టిన అధర్మపోరాట సభకు వచ్చి సంక్రాంతి కానుకగా ఇస్తానని చెబుతున్నాడని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ప్రజలు చంద్రబాబు చెప్పిందల్లా నమ్మడానికి అమాయకులు కాదని, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గుణపాఠం చెబుతారన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ బినామీగా ఉన్న దేవినేని ఉమా తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దేవినేని ఆరోపణలపై ఎలాంటి ఎంక్వైరీకైనా సిద్ధమన్నారు. 
 
Back to Top