టీడీపీ మూల సిద్ధాంతాన్ని మర్చిపోయావా చంద్రబాబు..

వైయస్‌ఆర్‌సీపీ నేత వైయస్‌ వివేకానంద రెడ్డి
కృష్ణా జిల్లాః రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ముతో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారో..వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలను డబ్బుతో మభ్య పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత వైయస్‌ వివేకానంద రెడ్డి అన్నారు.కృష్ణా జిల్లా నందిగామలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకున్నారని చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ మూల సిద్ధాంతాన్ని చంద్రబాబు మర్చిపోయారా అని ప్రశ్నించారు.చంద్రబాబు స్వార్థం రాజకీయాలతో పూటకో పార్టీతో పొత్తు పెట్టుకుని పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.మరోసారి ప్రజల్ని మోసం చేయాలని చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారన్నారు.చట్టాన్ని తన స్వార్థ ప్రయోజనాలు కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.నీతిమంతుడ్ని అంటూ చంద్రబాబు లాంటి వ్యక్తి విలువలు గురించి చెప్పడం హస్యాస్పదమన్నారు.
Back to Top